వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తాడిపత్రిలో కనిపిస్తే కాల్చివేత
అనంతపురం: తాడిపత్రిలో శుక్రవారం ఉదయం నుంచి తెలుగుదేశం, కాంగ్రెస్ వర్గాల పరస్పర దాడులతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఇరు పార్టీలవారు ఇళ్లపై, కార్యాలయాలపై పరస్పర దాడులకు దిగటంతో పోలీసులు పట్టణంలో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని డిఐజీ హెచ్చరికలు జారీ చేశారు.
ఎన్నికలు జరిగిన మర్నాడే తాడిపత్రిలో రాజకీయపార్టీలు తీవ్ర దౌర్జన్యాలకు పాల్పడటాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. దీనిపై తక్షణం తమకు నివేదిక పంపాలని ఎస్పీని ఎన్నికల ప్రధానాధికారి ఆదేశించారు. దీనిపై పరిశీలన జరిపి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.