వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మద్యం మానేశా: బిగ్ బి

By Staff
|
Google Oneindia TeluguNews

Amitabh Bachchan
ముంబయి: మొదట్లో తనకు మద్యపానం, పొగతాగటం, గుర్రపు పందాలకు వెళ్లటం వంటివి అలవాటయ్యాయని, అయితే, వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని తెలుసుకున్నాక యవ్వనంలోనే ఆ చెడు వ్యసనాలను వదిలేశానని బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ తెలిపారు. "డిగ్రీ పూర్తయ్యాక కోల్ కత్తాలో ఉద్యోగంలో చేరిన వెంటనే స్వాతంత్య్రం లభించినట్టు అనిపించింది. అప్పటి దాకా పెద్దలు వద్దని వారించిన పనులన్నీ చేయటానికి మనసు ఉవ్విళ్లూరింది. తొలి సిగరెట్‌ దమ్ము, మద్యం ఇచ్చే ఆనందం ఆకర్షించాయి. దీనికి తోడు అదృష్టాన్ని పరీక్షించుకోమని గుర్రప్పందాలు ఆహ్వానించాయి" అని అమితాబ్‌ తన బ్లాగులో వివరించారు. "వేళ్ల మధ్య సిగరెట్‌, చేతిలో మద్యం గ్లాసు పట్టుకోవటం నైతికంగా తప్పు కాదనే భావన కూడా ఏర్పడింది. చాలామందిలో ఇలాంటి అలవాట్లు మున్ముందూ కొనసాగుతుంటాయి. కానీ నేను మాత్రం వీటి వల్ల లాభం లేదని గ్రహించి, విడిచిపెట్టాను" అని తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X