కోల్‌కత్తా: తనకింకా ప్రధానమంత్రి పదవికి కావలసినంత అనుభవం లేదని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ కోల్‌కత్తాలో పేర్కొన్నారు. ఆయన శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనకు ప్రధాన మంత్రి పదవి మీద ఆశ లేదని, అంత అనుభవం రాలేదని అన్నారు. నేను కాంగ్రెస్ కార్యకర్తగానే పనిచేస్తానని, దేశంలోని నిరక్షరాస్యులు, పేద కుటుంబాలు అభివృద్ధి చెందడానికి తనవంతుగా కృషి చేస్తానని రాహుల్ చెప్పారు.
మళ్ళీ యుపిఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ఐదేళ్ళు సమర్ధవంతంగా పాలించిన మన్మోహన్ సింగ్ మళ్ళీ ప్రధాని అవుతారని రాహుల్ పేర్కొన్నారు. పోత్తులపై మాట్లాడుతూ వామపక్షాలకు యుపిఏ ద్వారాలు తెరిచే ఉంచిందని, వారు పేదలను విస్మరించారని అన్నారు. శ్రీలంకలోని ఎల్‌టీటీఈని ఉగ్రవాద సంస్థగా పేర్కొంటూ, తమిళులను కాపాడడం తమ బాధ్యతగా పేర్కొన్నారు.