కోల్ కత్తా: తన తండ్రి రాజీవ్ గాంధీతో పాటు వేలాదిమంది అమాయకులను లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం అన్యాయంగా చంపివేసిందని యువ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. లంక సమస్య సులభంగానే పరిష్కారమవుతుందని యుద్దం కారణంగా లంకలో ఇబ్బందులు పడుతున్న ప్రజలను యూపీఏ ప్రభుత్వం ఆదుకుంటుందని వెల్లడించారు.