వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'పెద్ద పులి' చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

By Staff
|
Google Oneindia TeluguNews

Prabhakaran
కొలంబో: ఎల్‌టీటిఈ అధినేత ప్రభాకరన్‌ ను 10 కిలోమీటర్ల పరిధిలో చుట్టుముట్టామని శ్రీలంక సైన్యం ప్రకటించింది. అడవిలోని ఓ చిన్న ప్రాంతంలో దాగి ఉన్న అతన్ని అతి త్వరలో పట్టుకుంటామని తెలిపింది. ఎల్‌టీటిఈ అధికార ప్రతినిధి బ్రిగేడియర్‌ శావేంద్ర సిల్వ మాత్రం ప్రభాకరన్‌ సైన్యానికి పట్టుబడటం కల్ల అని స్పష్టంచేశారు. మరో వైపు ప్రభాకరన్‌ 18 నెలలుగా బయట ఎవరికీ కనిపించలేదని, ఆయన ఎప్పుడో పారిపోయారని కూడా వదంతులు ప్రచారంలో ఉన్నాయి.

ప్రభాకరన్‌ పట్టుబడ్డాడంటూ శుక్రవారం వదంతులు వ్యాపించడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపింది. రాష్ట్రంలో ఈలం తమిళుల సానుభూతిపరులు అధికంగానే వున్నారు. ప్రభాకరన్‌ అభిమానులూ లేకపోలేదు. ఎండీఎంకే, డీపీఐ, ద్రావిడ కళగం, తమిళర్‌ దేశీయ విడుదలై ఇయ్యక్కం, తమిళ రచయితల సంఘం, తమిళ భాషాభిమానులు, తమిళ భాషా పరిరక్షణ కమిటీ, కొంతమంది సినీ ప్రముఖులు, న్యాయవాదులు ఎల్టీటీఈ సానుభూతిపరులన్న విషయం బహిరంగ రహస్యమే. కాగా, ప్రభాకరన్‌ నివశించే ప్రాంతానికి లంక సైన్యం సమీపించిందని, అతను త్వరలోనే పట్టుబడే అవకాశముందని వార్తలు వెలువడుతున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నాయి. లోక్‌ సభ ఎన్నికలు అతి సమీపంలోనే వుండడంతో ప్రభాకరన్‌ పట్టుబడితే అది తమ కొంప ముంచుతుందని పలు పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా వుండి కూడా శ్రీలంకలో కాల్పుల విరమణ పాటించేలా చర్యలు చేపట్టడంలో డీఎంకే అధినేత కరుణానిధి విఫలమయ్యారని ఇప్పటికే ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X