హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డిఎస్ క్షమాపణకు హరీష్ డిమాండ్

By Staff
|
Google Oneindia TeluguNews

Harish Rao
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను సమర్థించిన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ క్షమాపణ చెప్పాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేత హరీష్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణపై వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన వ్యాఖ్యలను శ్రీనివాస్ సమర్థించడంపై ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా మండి పడ్డారు.

భజన కోసమే రాజశేఖర రెడ్డి వ్యాఖ్యలను డి.శ్రీనివాస్ సమర్థించారని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను సమర్థించడం ద్వారా శ్రీనివాస్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారని ఆయన అన్నారు. డి.శ్రీనివాస్ తన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X