హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసెంబ్లీకి మధ్యంతరం తప్పదు: జెపి

By Staff
|
Google Oneindia TeluguNews

Jayaprakash Narayan
హైదరాబాద్‌: లోక్‌ సభ, శాసనసభలకు మధ్యంతర ఎన్నికలు ఖాయమని లోకసత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ అభిప్రాయపడ్డారు. మధ్యంతర ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి లోక్‌ సత్తా కార్యాలయంలో ఆదివారం రాత్రి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్‌సభ వ్యవహారం చూస్తుంటే రెండేళ్లలోనే ఎన్నికలు వచ్చేట్టున్నాయని, శాసనసభ ఎన్నికలు ఇంకా ముందే జరుగుతాయని ఆయన అన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలకు కూడా లోక్‌సత్తా పూర్తిగా సంసిద్ధమై, మిగతా ప్రాంతాల పార్టీ శాఖలకు దిశానిర్దేశం చేయాలన్నారు. శాసనసభ ఎన్నికల్లో 70 మందికి మించి సమర్థులైన అభ్యర్థులను ఎంపిక చేయలేకపోయానని జేపీ ఆవేదన వ్యక్తం చేశారు.

సక్రమంగా పనిచేయని కొంతమందిని ఇష్టానుసారంగా తిట్టానని, కానీ తమ పార్టీ అభ్యర్థుల్లో ఏ ఒక్కరూ సారా, డబ్బులు పంచి ప్రలోభాలకి గురి చేయలేదని గర్వంగా చెప్పగలనని ఆయన అన్నారు. దేశంలో కులం, మతం, భాష, ప్రాంతం అనేది లేకుండా కేవలం భావాల ఆధారంగా ఉద్యమిస్తుంది లోక్‌సత్తా ఒక్కటేనని సగర్వంగా ప్రకటించారు. మార్పు కోరుకుంటూ జనం సిద్ధంగా ఉన్నా లోక్‌ సత్తా ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో అందిపుచ్చుకోలేక పోయిందని పోయిందని ఆయన అన్నారు. మంచి నాయకత్వాన్ని తీసురాలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X