హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జయసుధ అరెస్టు, విడుదల

By Staff
|
Google Oneindia TeluguNews

Jayasudha
హైదరాబాద్: సినీనటి, సికింద్రాబాద్‌ అసెంబ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి జయసుధ అరెస్టయ్యారు. ఎన్నికల నిబంధనలు అతిక్రమించినందుకు ఆమెను సికింద్రాబాదులోని చిలకలగూడ పోలీసులు సోమవారం రాత్రి అరెస్టుచేసి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఈనెల 3న పోలింగ్‌ కేంద్రానికి 68 మీటర్ల దూరంలో నామాలగుండు చౌరస్తాలో పార్టీ కార్యాలయాన్ని జయసుధ ప్రారంభించారనే ఆరోపణపై ఆమె మీద కేసు నమోదైంది.

దానికి తోడు ప్రధాన రోడ్డులో పార్టీ జెండాను ఎగురవేసి వాహనదారులు, స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని అందిన ఫిర్యాదు మేరకు అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి, చిలకలగూడ పోలీసులు నామాలగుండులోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని సీజ్‌ చేసి ఎన్నికల సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేశారు. రోడ్ షోల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని కూడా ఆమెపై ఫిర్యాదులు వచ్చాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X