చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంపేస్తామంటూ..జయలలితకు

By Staff
|
Google Oneindia TeluguNews

Jayalalitha
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను హతమారుస్తామంటూ ఓ బెదిరింపు లేఖ వచ్చింది. చెన్నై పోయెస్‌ గార్డెన్‌లోని జయలలిత ఇంటికి సోమవారం మధ్యాహ్నం ఈ లేఖ అందింది. మద్రాసు హైకోర్టు ప్రాంగణంలో జరిగిన పోలీసు, న్యాయవాదుల ఘర్షణకు జయలలిత కారణమని, కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా శ్రీలంక తమిళుల వివాదంలో ఆమె నిర్ణయాలు తీసుకుంటున్నారని అందులో పేర్కొన్నారు. ఇలాగే ఆమె ప్రవర్తిస్తే ఇంటిని బాంబుతో పేల్చివేస్తామని బెదిరించారు. ఇన్‌లాండ్‌ లెటర్లో ఆంగ్లంలో ఈ ఉత్తరం రాసి ఉంది.

మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య తరహాలోనే మే 1, 4 తేదీల మధ్య ఆమెను కడతేర్చుతామని హెచ్చరించారు. దీనిపై అన్నాడిఎంకే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈనెల 13న జరుగనున్న లోక్‌సభ ఎన్నికలకు జయలలిత ప్రచారాన్ని అడ్డుకునేందుకే ఈ హెచ్చరిక లేఖను పంపారని అన్నాడీఎంకే న్యాయవాది ఎన్‌ నవనీతకృష్ణన్‌ విమర్శించారు. జయలలితకు తగిన భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. దీనిపై జయ ఇంటి సహాయకుడు కార్తికేయన్‌ తేనాంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X