వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్టీ నుంచి తప్పుకుంటా: అమర్

By Staff
|
Google Oneindia TeluguNews

Amar Singh
రాంపూర్: తమ పార్టీ నాయకుడు ఆజంఖాన్ వ్యవహారంపై లోకసభ ఎన్నికల అనంతరం పార్టీ నుంచి తప్పుకుంటానని సమాజ్ వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ తమ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ కు అల్టిమేటం ఇచ్చారు. తనపై ఆజంఖాన్ సహించరాని వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అన్నారు.పార్టీలో ఉండాలంటే ఆజంఖాన్ ను సంతోషపెట్టాలని ములాయం సింగ్ చేసిన ప్రకటనపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. తుది దశ పోలింగ్ జరిగే వరకు తాను వేచి చూస్తానని, ఆ తర్వాత పార్టీ నుంచి తప్పుకుంటానని అమర్ సింగ్ చెప్పారు.

ఆజంఖాన్ ములాయంకు ఇష్టమైనవాడని, తనపై ఆజం ఖాన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ తనను మౌనంగా ఉండాలని ములాయం సూచించారని ఆయన చెప్పారు. ఆజంఖాన్ నుంచి తనకు చెప్పు బహుమతిగా వస్తుందని ఎదురు చూస్తున్నానని ఆయన వ్యంగ్యంగా అన్నారు.ఆజంఖాన్ తనకు చెప్పు బహుమతిగా ఇస్తే ఆ విలువైన బహుమతిని అలంకరించి మ్యూజియంలో పెడతానని ఆయన అన్నారు. జయప్రదకు మద్దతుగా ఆయన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ఆజంఖాన్ పై విరుచుకుపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X