వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ వస్తే తప్పేంటట: వైఎస్

By Staff
|
Google Oneindia TeluguNews

YSR
కడప: కడప జిల్లా సమీక్షా సమావేశాల్లో ముఖ్యమంత్రి తనయుడు వైఎస్ జగన్ పాల్గొనడంపై చెలరేగిన విమర్శలకు రాజశేఖరరెడ్డి తనదైన శైలిలో స్పందించారు. జిల్లా అభివృద్ధి కమిటీలో జగన్ ఒక సభ్యుడని ఆయన అన్నారు. ప్రధానమంత్రి, రాష్ట్రపతి విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు వారి కుమారులను కుమార్తెలను అధికారిక సమావేశాలకు హాజరు కావడం మామూలేనని ఆయన సమర్ధించుకున్నారు. కాగా జిల్లా సమీక్షా సమావేశాలకు జగన్ ను ఎందుకు అనుమతించారని జెడ్పీటీసీ ఓబులేసు జిల్లా జాయింట్ కలెక్టర్ ను నిలదీశారు.

అధికారిక సమావేశానికి జగన్ హాజరుకావడాన్ని తెలుగుదేశం, వామపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. ఆ విమర్శలను కాంగ్రెస్ జెడ్పీటీసీలు, యువజన కాంగ్రెస్ నాయకులు తిప్పికొట్టారు. కడప జిల్లా అభివృద్ధికి విశేషంగా పనిచేస్తున్న జగన్ ఈ సమావేశాలకు హాజరు కావడం సముచితమేనని వారి వాదన.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X