వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా నగ్న చిత్రాలు పంపిణీ: జయప్రద

By Staff
|
Google Oneindia TeluguNews

Jayaprada
లక్నో‌: తమ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆజం ఖాన్ తన నగ్న చిత్రాల పోస్టర్లను పంచుతున్నారని సమాజ్ వాదీ పార్టీ రాంపూర్ లోకసభ అభ్యర్థి, సినీ నటి జయప్రద ఆరోపిస్తున్నారు. తనను రాంపూర్ లో ఓడించేందుకు ఈ దుశ్చర్యకు దిగారని ఆమె అన్నారు. ఆజంఖాన్ పార్టీ ప్రతిష్టను దిగజారుస్తున్నారని ఆమె విమర్శించారు. ఆజంఖాన్ చర్య స్త్రీ జాతికే అవమాన కరమని ఆమె అన్నారు. ఆజంఖాన్ చర్యపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

రాంపూర్ లో జయప్రదను ఓడించేందుకు ఆజంఖాన్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పార్టీ మరో నేత అమర్ సింగ్ తో తీవ్రంగా విభేదించిన ఆజంఖాన్ ఇందుకు సిద్ధపడ్డారు. జయప్రద అమర్ సింగ్ కు సన్నిహితురాలే కావడమే ఆజంఖాన్ ఆగ్రహానికి కారణం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X