వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయప్రద హోటల్లో తనిఖీలు

By Staff
|
Google Oneindia TeluguNews

Jayaprada
లక్నో‌: సినీ నటి, సమాజ్ వాదీ పార్టీ రాంపూర్ లోకసభ అభ్యర్థి జయప్రద బస చేసిన హోటల్లో సంబంధిత అధికారులు మరోసారి తనిఖీలు నిర్వహించారు. ఇంతకు ముందు ఒకసారి ఆమె బస చేసిన హోటల్ గదుల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. సమాజ్ వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆజంఖాన్ సహకరించకపోవడంతో జయప్రద గెలుపు రాంపూర్ లో అనుమానంగానే మారింది. ఆజంఖాన్ తన నగ్న చిత్రాల పోస్టర్లను పంచారని జయప్రద ఆరోపిస్తోంది. ఒక సోదరుడు తన సోదరి చిత్రాలను పంచినట్లుగా ఆజంఖాన్ తన చిత్రాలను పంపిణీ చేశారని ఆమె వ్యాఖ్యానించింది.

జయప్రద విజయానికి కృషి చేయాలని సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ చెప్పినా ఆజంఖాన్ వినడం లేదు.తన పోరాటం జయప్రద మీద కాదని, కళ్యాణ్ సింగ్ కు వ్యతిరేకంగానే తాను పోరాడుతున్నానని ఆజంఖాన్ అంటున్నారు. కళ్యాణ్ సింగ్ ను పార్టీలోకి తెచ్చిన పార్టీ మరో ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ పై ఆయన మండిపడుతున్నారు. అమర్ సింగ్ కు జయప్రద సన్నిహితురాలు కావడంతో రాంపూర్ లో జయప్రద ఓటమికి ఆజంఖాన్ కంకణం కట్టుకున్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఆజంఖాన్ కాంగ్రెసుకు అమ్ముడుపోయారని జయప్రద ఆరోపిస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X