వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయాలు వదలను: జయప్రద

By Staff
|
Google Oneindia TeluguNews

Jayaprada
రాంపూర్: తాను రాంపూర్ లోకసభ నియోజకవర్గంలో ఓడిపోతే కూడా రాజకీయాల నుంచి తప్పుకోనని ప్రముఖ సినీ నటి, సమాజ్ వాదీ పార్టీ లోకసభ అభ్యర్థి జయప్రద చెప్పారు. జయప్రదను ఓడించడానికి సమాజ్ వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆజంఖాన్ తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఆజంఖాన్ కు, జయప్రదకు మధ్య తీవ్ర వివాదం కూడా నడుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను రాజకీయాల నుంచి తప్పుకునే ప్రసక్తి లేదని ఆమె చెప్పారు. రాంపూర్ లో ఆమె బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆజం ఖాన్ తనపై రాజకీయ కుట్ర చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

తనను ఓడించడానికి ఆజంఖాన్ చేయని ప్రయత్నమంటూ లేదని, అందుకు ఆజంఖాన్ తన ప్రత్యర్థి, కాంగ్రెసు అభ్యర్థి నూర్ బానోను బలపరచడానికి కూడా వెనకాడలేదని ఆమె అన్నారు. తన నగ్న చిత్రాల పోస్టర్లను పంపిణీ చేయడం ఆజంఖాన్ కుట్రలో భాగమేనని, అది తనను తీవ్ర నిస్పృహకు గురి చేసిందని, కుటుంబ మద్దతుతో తాను దాని నుంచి బయటపడ్డానని, ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా ఆజంఖాన్ కు తగిన సమాధానం చెప్తానని ఆమె అన్నారు.

ఆజంఖాన్ పై పార్టీ చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారా అడిగితే ఆ విషయంపై నిర్ణయాన్ని తాను సీనియర్ పార్టీ నేతలకు వదిలేస్తున్నట్లు ఆమె జవాబిచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X