హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరును సిఎంను చేస్తాం: ఉపేంద్ర

By Staff
|
Google Oneindia TeluguNews

Parvathaneni Upendra
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు చిరంజీవిని ముఖ్యమంత్రిని చేయడానికి ఉన్న మార్గాలను పరిశీలిస్తున్నట్లు ప్రజారాజ్యం పార్టీ సీనియర్ నాయకుడు పర్వతనేని ఉపేంద్ర చెప్పారు. శుక్రవారంనాడు మీడియా ప్రతినిధులతో ఆయన ఆ విషయం చెప్పారు. లోకసభ, శాసనసభ అభ్యర్థుల శిబిరాన్ని ప్రజారాజ్యం పార్టీ హైదరాబాదు సమీపంలోని షామీర్ పేటలో నిర్వహిస్తోంది. విజయం సాధించే అభ్యర్థులు జారిపోకుండా పార్టీ ఈ శిబిరం నిర్వహిస్తోంది.

చిరంజీవిని ప్రజారాజ్యం లెజిస్లేచర్ పార్టీ నేతగా శనివారం విజయం సాధించే శాసనసభ అభ్యర్థులు ఎన్నుకుంటారు. దాంతో పావులు కదపడం ప్రజారాజ్యం పార్టీ నేతలు ప్రారంభిస్తారు. రాష్ట్రంలో హంగ్ వస్తుందనే అంచనాల నేపథ్యంలో చిరంజీవి ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. రెండు రకాల మార్గాలు చిరంజీవి వద్ద ఉన్నాయి. తమకు వచ్చే లోకసభ స్థానాలతో కాంగ్రెసుతో బేరానికి దిగి రాష్ట్రంలో ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవడం ఒక్కటైతే, కాంగ్రెసు తమ మద్దతు లేకుండా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేకపోతే ఆ ప్రభుత్వాన్ని కాంగ్రెసు మద్దతుతో తానే ఏర్పాటు చేయడం రెండోది. ఇందుకు తగిన ప్రణాళికను ప్రజారాజ్యం పార్టీ రూపొందించుకుంటున్నట్లు సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X