హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హంగ్: కాంగ్రెస్ కే చాన్స్

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా పూర్తి మెజారిటీ దక్కే అవకాశాలు లేవు. అయితే కాంగ్రెసు అతి పెద్ద పార్టీగా అవతరించే అవకాశాలున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాడనికి అవసరమైన 148 స్థానాలకు కాంగ్రెసుకు ఆరేడు స్థానాలు తక్కువ పడతాయనిపిస్తోంది. అయితే ప్రజారాజ్యం పార్టీ మద్దతు అవసరం లేకుండానే కాంగ్రెసు ప్రభుత్వం ఏర్పడవచ్చు. మజ్లీస్ కాంగ్రెసుకు మద్దతిచ్చే అవకాశం ఉంది. ప్రజారాజ్యం పార్టీ అంచనాలకు మించి విఫలం కావడంతో కాంగ్రెసు పుంజుకుంది. దానికి తోడు లోకసత్తా కోస్తాలో తెలుగుదేశం పార్టీ ఓట్లను చీల్చిన దాఖలాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని మహా కూటమి పార్టీల మధ్య ఓట్ల బదిలీ జరిగినట్లు లేదు.

తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను ప్రజలను పూర్తిగా నమ్మినట్లు లేరు. సిపిఐ, సిపిఎంల మధ్య కలతలు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), వామపక్షాల మధ్య అపనమ్మకం తెలంగాణలో తీవ్రంగా మహా కూటమిని దెబ్బ తీసినట్లు భావించవచ్చు. తెలంగాణలో మహా కూటమి ఆధిక్యత ప్రదర్శించినప్పటికీ అంచనాల మేరకు సీట్లను సాధించలేకపోయింది. బిజెపి, ప్రజారాజ్యం పార్టీలు కూడా మహా కూటమి ఓట్లను చీల్చినట్లు కనిపిస్తోంది. తెరాస తన సొంత బలం మేరకు మాత్రమే సీట్లను సాధించే అవకాశాలున్నాయి. తెలుగుదేశం, వామపక్షాల ఓట్లు తెరాసకు పడినట్లు లేవు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X