• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పెద్దపులి మృతదేహం లభ్యం

By Staff
|

Prabhakaran
కొలంబో: ఎల్టీటిఇ అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ మృతదేహాన్ని శ్రీలంక సైన్యం మంగళవారంనాడు స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వ బలగాల చేతిలో ప్రభాకరన్ సోమవారం మృతి చెందినట్లు శ్రీలంక సైన్యం ప్రకటించింది. అయితే ప్రభాకరన్ మరణించలేదని, బతికే ఉన్నారని ఎల్టీటిఇ అంతర్జాతీయ వ్యవహారాల అధిపతి పత్మనాభన్ ప్రకటించారు. ఈ స్థితిలో శ్రీలంక సైన్యం ప్రభాకరన్ మృతిని ధృవీకరించింది. ప్రభాకరన్ మృతదేహం ఫొటోలను పలు టీవీ చానెళ్లు ప్రసారం చేశాయి.

ప్రభాకరన్ తలలో బుల్లెట్ గాయం అయినట్లు శ్రీలంక సైనికాధిపతి జనరల్ శరత్ ఫోన్సెకా చెప్పారు. ప్రభాకరన్ మృతదేహం యుద్ధ క్షేత్రంలో కొద్ది గంటల క్రితం లభ్యమైందని ఆయన చెప్పారు. పార్లమెంటులో శ్రీలంక అధ్యక్షుడు మహిందా రాజపక్సే విజయ ప్రసంగం చేసిన కొద్ది గంటల తర్వాత ఫోన్సెకా ప్రభాకరన్ మృతిని ధృవీకరించారు. ప్రభాకరన్ మరణించాడనే ప్రకటనకు తాను బాధ్యత వహిస్తానని ఆయన అన్నారు. రాజపక్సే మాత్రం తన ప్రసంగంలో ప్రభాకరన్ మృతి గురించి ప్రస్తావించలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X