వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళ ప్రజలపై యుద్ధం కాదు: రాజపక్సే

By Staff
|
Google Oneindia TeluguNews

Mahinda Rajapakse
కొలంబో: ఎల్టీటిఇతో యుద్ధం ముగిసిందని శ్రీలంక అధ్యక్షుడు మహీందా రాజపక్సే అన్నారు. తాము యుద్ధం చేసింది ఎల్టీటిఇతోనే అని, తమిళ ప్రజలతో కాదని ఆయన వివరణ ఇచ్చారు. పెద్ద పులి ప్రభాకరన్ హతమై ఎల్టీటిఇతో యుద్ధం ముగిసిన సందర్భంగా ఆయన మంగళవారం ప్రసంగం చేశారు. తమిళులకు రక్షణ కల్పించడం తమ ప్రభుత్వ బాధ్యత అని ఆయన అన్నారు. ఎల్టీటిఇ పూర్తిగా ధ్వంసమైందని, ఇది ప్రజల విజయమని ఆయన అన్నారు.

రాజీవ్ గాంధీ, ప్రేమదాస, కాదిర్గమర్ హత్యల వెనక ఎల్టీటిఇ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. శ్రీలంకలో తమిళులు స్వేచ్ఛగా జీవించవచ్చునని ఆయన చెప్పారు. దేశంలో అందరికీ సమాన హక్కులు కల్పించడమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు. అస్తవ్యస్తంగా మారిన ఉత్తర శ్రీలంకను ఆదుకోవాలని ఆయన ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X