హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహానాడు ఏర్పాట్లపై బాబు సమీక్ష

By Staff
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్‌: ఈ నెల 27,28 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న మహానాడు ఏర్పాట్లపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో సమీక్షించారు. ఎన్నికల ఫలితాల తరువాత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు బుధవారం తొలిసారిగా పార్టీ కార్యాలయానికి వచ్చారు. గురువారం ఉదయం 9 గంటలకు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో టీడీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా శాసనసభా పక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకుంటారు.

మహానాడులో ఎన్నికల ఫలితాలపై సమీక్ష జరుపుతారు. ఓటమికి గల కారణాలను అన్వేషిస్తారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నందు వల్ల కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పార్టీకి నష్టం జరిగిందనే అభిప్రాయం పార్టీ నేతలు కొంత మంది నుంచి ఇప్పటికే వ్యక్తమవుతుంది. దీనిపై మహానాడులో విస్తృతంగా చర్చ జరిగే అవకాశాలున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X