తెలంగాణపై జెసి మరో వివాదం
హైదరాబాద్: తెలంగాణపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జెసి దివాకర్ రెడ్డి మరోసారి వివాదాస్పదమైన ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రజలు సమైక్యాంధ్రకే పట్టం కట్టారని ఆయన ప్రకటించి మరోసారి వివాదానికి తెర లేపారు. మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తమ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నారని, అందుకే మళ్లీ కాంగ్రెసుకు ప్రజలు ఓటేశారని ఆయన అన్నారు.
సమైక్యాంధ్ర కోసం కాసు బ్రహ్మానందరెడ్డి అవమానాలకు గురయ్యారని ఆయన చెప్పారు. తాము సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నట్లు వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారని ఆయన అన్నారు. సమైక్యాంధ్రలోనే అభివృద్ధి, మనుగడ సాధ్యమని కాసు బ్రహ్మానంద రెడ్డి విశ్వసించారని, వైయస్ కూడా అదే బాటలో నడుస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications