మిత్రుల పట్టు: పిఎం భేటీ వాయిదా

మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఈ నెల 22వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే మిత్రపక్షాలు కీలకమైన మంత్రిత్వ శాఖలను డిమాండ్ చేస్తున్నాయి. అలాగే ఎక్కువ మంత్రి పదవులను ఆశిస్తున్నాయి. దీంతో సోనియా గాంధీతో చర్చించి తదుపరి కార్యక్రమాన్ని ప్రధాని ఖరారు చేసుకుంటారు. డిఎంకె 9 మంత్రి పదవులను డిమాండ్ చేస్తుండగా, డిఎంకెకు ఇచ్చే మంత్రి పదవుల కన్నా ఒక్కటి ఇవ్వాలని తృణమూల్ కాంగ్రెస్ అంటోంది.
ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధులు డిఎంకె నేత కరుణానిధితో జరిపిన చర్చలు ఒక కొలిక్కి రాలేదు. ప్రణబ్ ముఖర్జీ బృందం మరోసారి గురువారం కరుణానిధితో సమావేశం కానుంది












Click it and Unblock the Notifications