హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పార్టీకి అల్లు అరవింద్ రాజీనామా?

By Staff
|
Google Oneindia TeluguNews

Allu Aravind
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీకి అల్లు అరవింద్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన రాజీనామాపై పార్టీ అధ్యక్షుడు చిరంజీవి నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. గురువారం జరిగిన పార్టీ సమావేశంలో ఆయన రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. సమావేశంలో ప్రజారాజ్యం పార్టీలోని విభేదాలు భగ్గుమన్నట్లు తెలుస్తోంది. ఆగ్రహావేశాలకు గురైన చేగొండి హరిరామ జోగయ్య సమావేశం నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయినట్లు సమాచారం.

అయితే అల్లు అరవింద్ రాజీనామా వార్తలను ప్రజారాజ్యం పార్టీ నేత తమ్మినేని సీతారాం ఖండించారు. సమావేశంలో అల్లు అరవింద్ పాత్రపై చర్చ జరగలేదని, అల్లు అరవింద్ రాజీనామా చేసినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు. ఓటమికి సమిష్టి బాధ్యత తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ఓటమికి గల కారణాలను ఇంకా విశ్లేషిస్తున్నామని, పూర్తిగా విశ్లేషించాల్సి ఉందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X