వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒరిస్సా సిఎంగా నవీన్ ప్రమాణం

By Staff
|
Google Oneindia TeluguNews

Naveen Patnaik
భువనేశ్వర్‌: ఒరిస్సా ముఖ్యమంత్రిగా బిజెడి పార్టీ అధినేత నవీన్‌ పట్నాయక్‌ మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. నవీన్‌తో ఒరిస్సా గవర్నర్‌ మురళీధర చంద్రకాంత్‌ భండారే ప్రమాణ స్వీకారాన్ని చేయించారు. రాజ్యాంగం, శాసనాలను అనుసరించి పరిపాలన చేస్తానని, రాగద్వేషాలకు పక్షపాతాలకు పాల్పడనని ఆయన ప్రమాణం చేశారు. ఒరిస్సా ముఖ్యమంత్రి పగ్గాలను చేపట్టడం నవీన్ పట్నాయక్ కు ఇది మూడోసారి.

147 మంది సభ్యులు గల ఒరిస్సా శాసనసభలో బిజెడి 103 స్థానాలను గెలుచుకుని పూర్తి మెజారిటీ సాధించింది. 21 లోకసభ స్థానాల్లో 14 స్థానాలను గెలుచుకుంది. నవీన్ పట్నాయక్ 11 ఏళ్ల బిజెపి మైత్రిని తెంచుకుని ఆయన వామపక్షాలు, ఎన్సీపిలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయనతో పాటు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X