తెలంగాణ పరిష్కారం కాలేదు: వైయస్

తమ విశ్వసనీయతకు, వంచనకు జరిగిన ఎన్నికల్లో ప్రజలు తమపై విశ్వాసాన్ని వ్యక్తం చేశారని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పేదలను పట్టించుకోలేదని ఆయన అన్నారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావిస్తున్నామని ఆయన చెప్పారు. జలయజ్ఞం, మౌలిక వసతుల కల్పనలకు ఇబ్బంది కలగకుండా సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని ఆయన చెప్పారు. పార్టీకి మేలు చేసేవారిని మరిచిపోయే సమస్య లేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎదిగే కొద్ది ఒదగాలని పార్టీ కార్యకర్తలను కోరుతున్నట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ ఇవ్వకూడదనే ఉద్దేశం తమకు లేదని, ఒక రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎదురయ్యే కొత్త సమస్యలు ఎదురవుతాయని, ఆ సమస్యలకు పరిష్కార మార్గాలను కనుక్కున్న తర్వాత కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయడానికి వీలవుతుందని ఆయన అన్నారు. తెలంగాణ సమస్యకు ఎన్నికలు పరిష్కారం చూపాయని తాను అనుకోవడం లేదని ఆయన అన్నారు. ఎన్నికలు ఒక్క సమస్యపై జరగలేదని ఆయన చెప్పారు. తెలంగాణ సమస్యపైననే కాకుండా ఇతర సమస్యలపై కూడా తాము దృష్టి పెడతామని ఆయన చెప్పారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి సమగ్రాభివృద్ధి సాధిస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణపై కాంగ్రెసు స్పష్టంగా ఉందని ఆయన చెప్పారు. తెలంగాణ సెంటిమెంట్ ఉందని తెలుసునని, కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా కొన్ని ప్రాంతాల్లో తక్కువగా ఉందని, ఉన్నదాన్ని నాయకులు ఎక్కువ చేసే పద్ధతి కూడా ఉందని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు.తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వ హయాంలో చంద్రశేఖరరావును మంత్రివర్గంలోకి తీసుకుని ఉంటే తెరాస వచ్చేది కాదని ఆయన అన్నారు.
కాంగ్రెసులో వర్గ విభేదాలపై వేసిన ప్రశ్నకు సమాధానమిస్తూ కాంగ్రెసులో వర్గాలు లేవని, ఉన్న వర్గం ఒక్కటే అని, అది సోనియా వర్గమని ఆయన అన్నారు. విధానాల్లో, కార్యక్రమాల్లో తాము ప్రధానమైన మార్పులను వేటినీ ప్రతిపాదించలేదని, అమలు చేస్తున్న కార్యక్రమాలను మరింత బాగా, పారదర్శకంగా అమలు చేస్తామని ఆయన చెప్పారు. మరింత సమర్థంగా ప్రస్తుత కార్యక్రమాలను అమలు చేయడమే తమ ముందుందని ఆయన చెప్పారు.
-
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఐఎండీ హెచ్చరిక: 40డిగ్రీలు దాటి ఈ జిల్లాలలో నిప్పుల కుంపటిలా ఎండలు! -
ఏపీలో రైతులకు క్యూఆర్ కోడ్ తో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ.. చంద్రబాబు తీపికబురు! -
Chandrababu: ప్రజల మధ్యే అధికారులకు బాబు వార్నింగ్...! 1995ను గుర్తుచేస్తూ..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..!












Click it and Unblock the Notifications