• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జెసి మాట తప్పు: కోమటిరెడ్డి

By Staff
|

Komatireddy Venkat Reddy
హైదరాబాద్: ఎన్నికల్లో ప్రజలు సమైక్యాంధ్రకే ఓటేశారని తమ పార్టీ నాయకుడు జెసి దివాకర్ రెడ్డి చేసిన ప్రకటనతో కాంగ్రెస్ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి విభేదించారు. ఎన్నికల ఫలితాలకు తెలంగాణవాదంతో సంబంధం లేదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణవాదం బలంగానే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు తెలంగాణవాదాన్ని ఓడించలేదని, తెలంగాణవాదాన్ని ఫణంగా పెట్టినవారిని ఓడించారని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కూడా తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేశారని ఆయన చెప్పారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు కాంగ్రెసు సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు సిద్ధాంతాలను పక్కన పెట్టి ఎన్నికల్లో పోటీ చేయడం వల్లనే ఓడిపోయారని ఆయన అన్నారు. మహాకూటమి తెలంగాణవాదాన్ని ఫణంగా పెట్టే ప్రయత్నం చేసిందని ఆయన విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X