హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తప్పు నాది కాదు: అల్లు అరవింద్

By Staff
|
Google Oneindia TeluguNews

Allu Aravind
హైదరాబాద్‌: ఎన్నికల్లో పార్టీ విఫలం కావడానితి తన తప్పేమీ లేదని ప్రజారాజ్యం పార్టీ ప్రధాన కార్యదర్శి అల్లు అరవింద్ చెప్పుకున్నట్లు సమాచారం. శుక్రవారం జరిగిన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పిఎసి) సమావేశంలో ఆయన తనకు తాను క్లీన్ చిట్ ఇచ్చుకున్నట్లు సమాచారం. టికెట్ల పంపకంలో గానీ, పార్టీ ఇతర వ్యవహారాల్లో గానీ తాను ఏ విధమైన పొరపాటు చేయలేదని ఆయన చెప్పుకున్నట్లు తెలుస్తోంది.

ఎవరెవరికి టికెట్లు ఇచ్చింది, ఎవరెవరు చెప్తే ఇచ్చిందీ, ఏ పరిస్థితుల్లో ఇచ్చిందీ అన్ని వివరాలపై నివేదిక ఉందని, అవసరమైతే చూపించడానికి సిద్ధమేనని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. అల్లు అరవింద్ వాదనతో పార్టీ ముఖ్యులు ఏకీభవించినట్లు తెలుస్తోంది. పార్టీలో కొత్తదనం లేకపోవడమే అపజయానికి కారణమని భావించినట్లు తెలుస్తోంది.

కుమ్మక్కయి బలహీనమైన అభ్యర్థులను పోటీకి పెట్టామనే ప్రచారం కూడా దెబ్బ తీసిందని అభిప్రాయపడినట్లు సమాచారం. చిరంజీవిపై ప్రజల్లో అనుకూలత ఉందని, ఇకపై మీడియాను పరిగణనలోకి తీసుకోవాలని అభిప్రాయపడినట్లు చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X