హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రులు వీరే: 'రాజ' ముద్ర

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్‌: మంత్రివర్గ జాబితాకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా ఆమోదం లభించటంతో సోమవారం సాయంత్రం 6.40కు కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ఎన్డీ తివారీ మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రాజశేఖర రెడ్డి మంత్రి వర్గంలో పాతకొత్తల కలయిక కనిపించింది. కొత్తవారికి చాలా మందికి మంత్రి వర్గంలో చోటు లభించింది. సీనియర్లు కె.జానారెడ్డి, జెసి దివాకర్ రెడ్డి, కాసు వెంకటకృష్ణా రెడ్డి, ఆర్.దామోదర్ రెడ్డిలకు మంత్రి వర్గంలో చోటు దక్కలేదు. ఆర్.దామోదర్ రెడ్డి సోదరుడు ఆర్ వెంకటరెడ్డికి మంత్రి వర్గంలో స్థానం దక్కింది.

మంత్రి వర్గ కూర్పులో వైయస్ రాజశేఖర రెడ్డి ముద్ర స్పష్టంగా కనిపించింది. తన అనుయాయులకే మొత్తం మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. కొద్దిగా స్వతంత్రంగా వ్యవహరిస్తారనుకున్న వారికి ఎవరికీ మంత్రి వర్గంలో చోటు కల్పించలేదు. జానారెడ్డి, జెసి దివాకర్ రెడ్డిలకు ఆ కారణంగానే మంత్రి వర్గంలో స్థానం కల్పించలేదని భావిస్తున్నారు. నల్లగొండ జిల్లా నుంచి జానారెడ్డికి ఇవ్వకుండా దామోదర్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే అసంతృప్తులు బయలుదేరవచ్చు. దాంతో తనకు అత్యంత సన్నిహితుడైనప్పటికీ దామోదర్ రెడ్డి పక్కన పెట్టి ఆయన సోదరుడికి మంత్రి పదవి కట్టబెట్టారు. మంత్రివర్గంలో ఆదిలాబాద్ జిల్లాకు స్థానం దక్కలేదు. గుంటూరు జిల్లాకు నాలుగు మంత్రి పదవులు దక్కాయి. తన మంత్రి వర్గంలోకి రాజశేఖర రెడ్డి ఆరుగురు మహిళలను తీసుకున్నారు.

వైయస్ రాజేశేఖర రెడ్డి మాటనే తమ బాటగా భావిస్తూ వస్తున్న సీనియర్లు పొన్నాల లక్ష్మయ్య, బొత్సా సత్యనారాయణ, కన్నా లక్ష్మినారాయణ వంటి వారిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. రోశయ్యను తిరిగి మంత్రి వర్గంలోకి చేరుకున్నారు. పార్టీకి, ప్రభుత్వానికి రోశయ్య నిబద్ధత కారణంగా ఆయనకు ఆ పదవి దక్కింది. మంత్రివర్గంలో రెండో మాటకు అవకాశం లేకుండా రాజశేఖర రెడ్డి చూసుకున్నారు. అత్యధిక పార్లమెంటు స్థానాలను గెలిపించి పెట్టడం ద్వారా, శాసనసభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించడం ద్వారా కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద రాజశేఖర రెడ్డికి తిరుగులేకుండా పోయింది. దీంతో రాజశేఖర రెడ్డి ఇచ్చిన జాబితాను మార్పులు చేర్పులు లేకుండా సోనియా గాంధీ అంగీకరించినట్లు చెబుతున్నారు.

రాజశేఖర రెడ్డి కొలువు

ప్రకాశం: రోశయ్య, బాలినేని శ్రీనివాసరెడ్డి
గుంటూరు: కన్నా లక్ష్మీ నారాయణ, గాదె వెంకటరెడ్డి, మోపినేని వెంకటరమణ, మాణిక్య వర ప్రసాద్‌
శ్రీకాకుళం: ధర్మాన ప్రసాదరావు, శత్రుచర్ల విజయరామరాజు
తూ.గో: పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, విశ్వరూప్‌
ప.గో: వట్టి వసంతకుమార్‌, పితాని సత్యనారాయణ
విజయనగరం: బొత్స సత్యనారాయణ
నెల్లూరు: ఆనం రాంనారాయణరెడ్డి
రంగారెడ్డి: సబితా ఇంద్రారెడ్డి
కడప: అహ్మదుల్లా
అనంతపురం: రఘువీరారెడ్డి, శైలజానాథ్‌
కృష్ణా: పార్థసారధి
హైదరాబాద్‌: ముఖేష్‌గౌడ్‌, దానం నాగేందర్‌
చిత్తూరు: గల్లా అరుణకుమారి, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి
మహబూబ్‌నగర్‌: డీకే అరుణ, జూపల్లి కృష్ణారావు
కర్నూలు: శిల్పారెడ్డి
విశాఖ: పసుపులేటి బాలరాజు
కరీంనగర్‌: శ్రీధర్‌బాబు
మెదక్‌: సునీతా లక్ష్మారెడ్డి, గీతారెడ్డి, దామోదర రాజనర్సింహ
నిజామాబాద్‌: సుదర్శన్‌రెడ్డి
వరంగల్‌: పొన్నాల లక్ష్మయ్య, కొండా సురేఖ
నల్గొండ: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ఖమ్మం: రాంరెడ్డి వెంకటరెడ్డి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X