హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఊహించలేదు: సబితా ఇంద్రారెడ్డి

By Staff
|
Google Oneindia TeluguNews

Sabitha Indra Reddy
హైదరాబాద్‌: తనకు అత్యంత కీలకమైన హోంశాఖను ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కేటాయిస్తారని తాను ఊహించలేదని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. హోంశాఖను గతంలో ఆమె భర్త పి.ఇంద్రారెడ్డి కూడా నిర్వహించారు. తనపై నమ్మకంతో హోం మంత్రిత్వ శాఖను కేటాయించినందుకు ఆమె ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. మహిళల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తానని ఆమె మంగళవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.

హోం శాఖలోని సవాళ్లను సమర్థంగా ఎదుర్కుంటానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సహాయ సహకారాలు తీసుకుని శాఖకు సంబంధించిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని ఆమె చెప్పారు. కాంగ్రెసు ప్రభుత్వం మహిళల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెరుగుతోందని, తాను మహిళను కావడం వల్ల అందుకు సంబంధించిన బాధ్యత తనపై మరింత పెరిగిందని ఆమె అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X