హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్టీఆర్ సిగ్గు నేర్పారు: రోజా

By Staff
|
Google Oneindia TeluguNews

Roja
హైదరాబాద్: ఆడపిల్లలా సిగ్గుపడడం నేర్పింది తనకు స్వర్గీయ ఎన్టీ రామారావేనని తెలుగు మహిళ అధ్యక్షురాలు, సినీ నటి రోజా అన్నారు. తెలుగుదేశం మహానాడు కార్యక్రమంలో ఆయన గురువారం ప్రసంగించారు. తనకు స్వర్గీయ ఎన్టీ రామారావుతో నటించాలనే ఆశ ఉండేదని, అయితే ఆ అవకాశం రాలేదని ఆమె అన్నారు. అయితే బాలకృష్ణతో నటించే సమయంలో తనకు ఆడపిల్లలా నడవడం, సిగ్గు పడడం ఎన్టీ రామారావు నేర్పినట్లు ఆమె చెప్పారు. తనకు సిగ్గుపడడం తెలియదని ఆమె అన్నారు.

తాను మగపిల్లవాడిలా నడుస్తానని అందరూ ఎగతాళి చేసేవారని ఆమె అన్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావుతో కలిసి నటించలేకపోయినా ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీలో పనిచేసే అవకాశం తనకు లభించిందని ఆమె అన్నారు. ఎన్టీ రామారావు గురించి మాట్లాడడానికి తనకు వయసు సరిపోదని ఆమె అన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఎన్టీ రామారావు కళాకారుడు కావడం తమ కళాకారులందరికీ గర్వకారణమని ఆమె అన్నారు. పరిపాలనలో కూడా ఎన్టీ రామారావు అందరి మన్ననలు పొందారని ఆమె అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X