దాడులపై ఆస్ట్రేలియా ప్రభుత్వం
మెల్‌బోర్న్ : భారతీయ విద్యార్థి సంఘాలు చేసిన ఆందోళనతో ఆస్ట్రేలియా ప్రభుత్వం దిగివచ్చింది. తమపై దాడులకు పాల్పడిన వారిని పట్టుకుని శిక్షించాలని, భారతీయులకు పూర్తి రక్షణ కల్పించాలని ఈ ఆందోళన నిర్వహించారు. ఆస్ట్రేలియాలోని భారతీయులకు పూర్తి రక్షణ కల్పిస్తామని, ఇక మీద ఎలాంటి దాడులు జరగకుండా చూస్తామని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి స్మిత్ హామీ ఇచ్చారు. దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.
ఇక్కడికి రావొద్దు. ఈ దేశంలో ప్రాణాలకు గ్యారెంటీ లేదు. మన దేశంలోనే చదువుకోండి. ఆస్ట్రేలియాలో జాత్యహంకారుల దాడులతో బెంబేలెత్తుతున్న భారతీయ విద్యార్థులు ఇస్తున్న సలహా ఇది. చదువులకోసం ఆస్ట్రేలియాకు రావద్దని వీరు విస్పష్టంగా చెబుతున్నారు. "శ్రవణ్ కుమార్‌ను స్క్రూడ్రైవర్‌తో పొడిచారు. అతను కోమాలోకి వెళ్లిపోయాడు. రాజేశ్‌పై పెట్రోలు బాంబు విసిరారు. ఇక్కడ పరిస్థితి ఏమాత్రం బాగలేదు. కర్నాల్‌లోని నా ఫ్రెండ్‌కు వీసా వచ్చినా... ఆస్ట్రేలియాకు రావడానికి భయపడుతున్నాడు'' అని బల్జీందర్‌సింగ్ అనే విద్యార్థి తెలిపాడు. ఆయన కూడా జాతి వివక్ష బాధితుడే.












Click it and Unblock the Notifications