వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్పీకరుగా మీరాకుమార్‌ కన్ఫర్మ్

By Staff
|
Google Oneindia TeluguNews

Karuna kumar
న్యూఢిల్లీ : ఊహించినట్లుగానే లోకసభ స్పీకరుగా కేంద్ర జలవనరుల మంత్రి మీరా కుమార్‌ పేరును కాంగ్రెస్‌ ఖరారు చేసింది. దీంతో దేశ తొలి మహీళా స్పీకర్‌గా మీరాకుమార్‌ చరిత్ర సృష్టించారు. మొదట ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కిషోర్‌ చంద్రదేవ్‌ పేరు ఖరారయిందని అందరూ అనుకున్న సమయంలో అనూహ్యంగా మీరాకుమార్‌ పేరు తెరమీదికి వచ్చింది. మీరాకుమార్‌ మరెవరో కాదు మాజీ ఉప ప్రధాని జగ్జీవన్‌రామ్‌ కుమార్తె. ఇటీవల కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా కూడా నియమితులయ్యారు.

బీహార్‌కు చెందిన దళిత నాయకురాలు మీరా కుమార్‌ . మొదట్లో రాజస్థాన్‌కు చెందిన గిరిజావ్యాస్‌ పేరును కూడా పరిశీలించినప్పటికీ... మీరా కుమార్‌ వైపే మొగ్గినట్లు సమాచారం. ఈమె పేరు తెరమీదికి రావడంతో.. ఇక ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కిశోర్‌ చంద్రదేవ్‌ అవకాశాలు పోయినట్లే . మీరాకుమార్‌కు ప్రధాని మన్మోహన్‌ ఇప్పటికే జలవనరుల మంత్రిత్వ శాఖను కట్టబెట్టారు. ఆమె శుక్రవారమే బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడా పదివికి రాజీనామా చేస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X