జెరూసలేం : రాష్ర్టం తీవ్రంగా ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యను వచ్చే 20 రోజుల్లో పరిష్కరిస్తామని సిఎం హామీ ఇచ్చారు.అలాగే తెలంగాణ అంశం ఇక మరుగున పడినట్లేనని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యాఖ్యానించారు. జెరూ సలేం పర్యటనలో ఉన్న సిఎం బెత్లెహాంలో పీటీఐ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని ఆయన అనడం విశేషం. తెలంగాణ వల్ల కొత్త సమస్యలు కొని తెచ్చుకోవాలన్నది తమ ఉద్దేశం కాదని ఆయనన్నారు. అన్ని రకాల సమస్యలు పరిష్కరించడానికే తెలంగాణపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయ తెలిపారు. అందుకే తెలంగాణ అంశం పరిష్కారానికి ప్రత్యేక కమిటీ వేశాం అని సిఎం వివరించారు. కాగా.. కేంద్ర మంత్రి వర్గంలో రాష్ట్రానికి అన్యాయం జరగలేదని, కేంద్రం నుంచి అధిక నిధులు రాబట్టేందుకు కృషి చేస్తామని సిఎం స్ఫష్టం చేశారు.