కూరరాజన్నకు మళ్ళీ హార్ట్ స్ట్రోక్
హైదరాబాద్: జనశక్తి మాజీ అగ్రనేత కూరరాజన్నకు మరోసారి గుండెపోటుకు గురి అయ్యారు. దాంతో ఆయన్ని కేర్ ఆస్పత్రికి తరలించారు. ప్రగతిశీల విద్యార్థి ఉద్యమ నాయకుడు శేషగిరిరావు సంస్మరణ సభకు వెళ్లిన ఆయన అక్కడ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. దాంతో అక్కడి నుంచి ఇంటికి చేరుకోగానే గుండెపోటుకు గురైయ్యారు. శనివారమే ఆస్పత్రి నుంచి డిశార్జి అయిన ఆయన మరల ఆదివారం రాత్రి గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం నిపుణులైన వైద్యల పర్యవేక్షణలో వైద్యం జరుగుతోంది.