ఆస్ట్రేలియాలో మరో దాడి
మెల్‌బోర్న్: కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఓ ప్రక్క ఆస్ట్రేలియా ప్రభుత్వం హామీలిస్తున్నా భారతీయ విధ్యార్దులపై దాడులు ఆగటం లేదు. తాజాగా నర్సింగ్ విద్యను అభ్యసిస్తున్న నిర్దీస్ కుమార్ సింగ్ పై గుర్తుతెలియని దుండగుడు కత్తితో దాడి చేసి గాయపరిచాడు. నిర్దీస్ ఓ నెల క్రిందటే లూధియానా నుంచి ఆస్ట్రేలియాకు వచ్చారు. అతను Chisholm Technical Institute లో నర్శింగ్ స్టూడెంట్. నర్సింగ్ క్లాసులకు హాజరై సబర్బన్ రైళ్లో తిరిగి వస్తుండగా మెల్‌బోర్న్ శివార్లలో నిర్దీస్ కత్తిపోట్లకు గురయ్యాడు. దీంతో ఆయన్ను స్థానికంగా ఉన్న ఆస్పత్రుల్లో చేర్పించారు. దీనిపై భారతీయసంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. నిరశనలు వ్యక్తమవుతున్నా,ఆస్ట్రేలియా ప్రభుత్వం హామీ ఇచ్చినా భారతీయులపై దాడులు పరంపర కొనసాగుతూనే ఉండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. నిర్దీస్ ప్రస్తుతం మెలబోర్న్ హాస్పటిల్ లో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు.












Click it and Unblock the Notifications