హైదరాబాద్: రాజకీయ పార్టీలు కుటుంబాల పార్టీలుగా కాకూడదని...అవి ప్రజల ఆస్తిగా ఉండాలని లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా బీహెచ్ ఈఎల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నాయకులు దేశానికి పనికి వచ్చే నిజాయితీ గల రాజకీయాలను మాత్రమే చేయాలని తెలిపారు. అలాగే సంప్రదాయ రాజకీయాలను పాతిపెట్టి కొత్త రాజకీయాలతో ప్రజల్లోకి రావాలని ఆయన సూచించారు.