టెక్కలి ఎమ్మెల్యే మృతి
శ్రీకాకుళం: టెక్కలి కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవతీపతి గుండెపోటుతో మృతి చెందారు. నాలుగు రోజులుగా ఆయన విశాఖ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ఆయన ఆరోగ్యం మరింత విషమంగా మారడంతో మధ్యాహ్నం చనిపోయారు. రేవతీపతి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆర్థిక మంత్రి రోశయ్యలు సంతాపం ప్రకటించారు. విశాఖలోని కేర్ ఆస్పత్రి వైద్యులు మెరుగైన వైద్యం అందించినా ఫలితం లేకపోయింది.