ఆస్ట్రేలియాలో మరో ఇండియన్ పై దాడి
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలో మరో భారతీయ విద్యార్థిపై దాడి తాజాగా దాడి జరిగింది. హర్యానాకు చెందిన అమృత్ పాల్ సింగ్(20)పై మెల్బోర్స్ లో దాడి జరిగింది. అతను మెల్బోర్న్ లో పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ మేనేజ్ మెంట్ కోర్సు చేస్తున్నారు. శుక్రవారం తను పనిచేసే ప్రాంతానికి వెళ్తుండగా మెక్ డొనాల్డ్ షాప్ వద్ద అయిదుగురు యువకులు అతడిని ముట్టడించారు.
"దుండగుల్లో ఒకడు నా వద్దకు వచ్చాడు. సెల్ ఫోన్ లాక్కొన్నాడు. దయచేసి ఇవ్వాల్సిందిగా నేను వేడుకొన్నా. కానీ అతడు నా ముఖంపై బలంగా కొట్టాడు. నేను కూడా ప్రతిదాడి చేశాను. ఆ వెంటనే అతడి స్నేహితులు వచ్చి నన్ను తీవ్రంగా కొట్టారు" అని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. దుండగుల్లో ఒకడు కత్తితో గాయపరిచేందుకు ప్రయత్నించాడని అతను చెప్పాడు.












Click it and Unblock the Notifications