హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శరద్ యాదవ్ చావాల్సిందే: నారాయణ

By Staff
|
Google Oneindia TeluguNews

Narayana
హైదరాబాద్‌: మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రస్తుత రూపంలో అమలు చేస్తే పార్లమెంటులోనే విషం తాగి ఆత్మహత్య చేసుకుంటానని జేడీయూ(యు) అధ్యక్షుడు శరద్‌ యాదవ్‌ వ్యాఖ్యలకు సీపీఐ ఘాటుగా స్పందించింది. మహిళ బిల్లు అడ్డుకోవడానికి శరద్‌ యాదవ్‌ చనిపోతానంటే తానే విషంపంపిస్తానని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఒకరు చనిపోయినంత మాత్రన మహిళా బిల్లు ఆగదని హెచ్చరించారు.మహిళా బిల్లును వ్యతిరేకిస్తే శరద్ యాదవ్ చావాల్సిందేనని ఆయన అన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ మహా కూటమితోనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అయితే తాము తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో కలిసి పని చేయబోమని ఆయన చెప్పారు. ఆస్ట్రేలియాలో ఆంధ్ర విద్యార్థులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. రేపు (ఆదివారం) తల్లిదండ్రులతో భారీ సభ నిర్వహిస్తామని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X