• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ప్రభుదేవాతో ప్రేమ లేదు: నయనతార

By Staff
|

Nayantara
హైదరాబాద్: తనకు ప్రభుదేవాకు మధ్య ప్రేమ వ్యవహారం ఏదీ లేదని ప్రముఖ సినీ నటి నయనతార స్పష్టం చేసింది. వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు ఊహాగానాలు చెలరేగాయి. నయనతారతో ప్రేమ, పెళ్లి గురించి ఇటీవ ఒక ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ప్రభుదేవా సమాధానం చెప్పడానికి నిరాకరించారు. ఇది పూర్తిగా తన వ్యక్తిగతమని, దయచేసి అడగవద్దని, తానేమీ చెప్పనని ఆయన అన్నాడు. దీంతో వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారంపై ప్రచారం ఊపందుకుంది. అయితే నయనతార మాత్రం అటువంటిదేమీ లేదని అంటోంది.

తన దృష్టి అంతా సినిమాలపైనే ఉందని, తామిద్దరం ప్రేమించుకోవడం లేదని అంటూ నయనతార తన వ్యక్తిగత మేనేజర్ ద్వారా ఒక ప్రకటన ఇప్పించింది. తనకు ప్రేమించే తీరిక కూడా లేదని, తనకు పరిశ్రమలో చాలా మంది మిత్రులున్నారని, ప్రభుదేవాతో తన స్నేహం ప్రత్యేకమైందని, దానికి ప్రేమా పెళ్లీ అంటూ ఆపాదించడం సరి కాదని నయన తార వివరణ ఇచ్చింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X