వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అతనికి పెళ్లైంది: రైమా సేన్

By Staff
|
Google Oneindia TeluguNews

Raima Sen
ముంబయి: టెన్నిస్ ఆటగాడు మహేష్ భూపతితో తనకు సంబంధాలు ఉన్నట్లు వచ్చిన వార్తలను బాలీవుడ్ నటి రైమా సేన్ కొట్టి పారేసింది. వీరిద్దరు కలిసి ఒక నైట్ క్లబ్ లో దర్శనమివ్వడంతో వారిరువురికి మధ్య ప్రేమాయణం సాగుతున్నట్లు ప్రచారం మొదలైంది. మహేష్ భూపతి కంపెనీ తన పనులు చూస్తుందని, కంపెనీకి అతను బాస్ అని, అతన్ని కలవడం అదే తొలి సారి అని, తన కంపెనీ సహచరులతో అతను వెళ్లాడని, తన మిత్రులతో తాను వెళ్లానని రైమా సైన్ వివరణ ఇచ్చుకుంటోంది.

అతని సంస్థ మనుషులు తనకు పరిచయమని, అతన్ని వారు తనకు పరిచయం చేశారని, దాంతో ఇద్దరం మాట్లాడుకున్నామని ఆమె చెబుతోంది. అదే కథను మహేష్ భూపతి కూడా వినిపిస్తున్నాడు. పెళ్లయిన వ్యక్తిని తాను ప్రేమించబోనని, మహేష్ కు ఇప్పటికే పెళ్లయిందని రైమా మరింత వివరణ ఇస్తోంది. ఇటువంటి ప్రచారాలకు తానేమీ ఆందోళన చెందబోనని, తన తల్లిదండ్రులు అదే మాట అనకపోతే చాలునని ఆమె అంటోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X