హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆంధ్రానే ఆదర్శం: గవర్నర్

By Staff
|
Google Oneindia TeluguNews

ND Tiwari
హైదరాబాద్‌: ఆర్థిక వ్యవహారాల్లో రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర గవర్నర్ ఎన్డీ తివారీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ను ఆదర్శంగా తీర్చుదిద్దుతామని ఆయన చెప్పారు. రాష్ట్ర ఉభయ సభలను ఉద్దేశించి ఆయన సోమవారం ప్రసంగించారు. మంత్రి రోశయ్య కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతనే తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. గత ఐదేళ్లలో ప్రజలపై పన్నులు వేయలేదని, విద్యుత్ చార్జీలు పెంచలేదని ఆయన అన్నారు. ఇటీవలి ఎన్నికల్లో ప్రజలు ప్రలోభ, వేర్పాటువాద రాజకీయాలను తిరస్కరించారని ఆయన అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి ఎక్కడా లేని విధంగా పథకాలు చేపట్టామని ఆయన చెప్పారు.

దేశం సగటు వృద్ధి రేటు కన్నా రాష్ట్రం ఎక్కువ వృద్ధి రేటును సాధించిందని ఆయన చెప్పారు. పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో ఎంతో ప్రగతి సాధించామని ఆయన చెప్పారు. సాగు నీటి ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సుపరిపాలనను అందించడానికి పునరంకితం అవుతున్నామని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం గత ఐదేళ్లలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు. అంతర్జాతీయ తీవ్రవాదాన్ని ఎదుర్కునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆనయ చెప్పారు. ఆర్థిక మాంద్యం పరిస్థితులను ఎదుర్కునేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. గత ఐదేళ్లలో అనుసరించిన విధానాలనే ఇక ముందు కూడా అనుసరిస్తామని ఆయన చెప్పారు. సత్యం వ్యవహారంలో 50 వేల మంది ఉద్యోగుల రక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన కృషి ప్రశంసనీయమని ఆయన అన్నారు.

గవర్నర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

- ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల సహకారంతో స్వచ్ఛంద సహకార సేద్యం
- 108, 104 సర్వీసుల మాదిరిగా సంచార పశు వైద్య శాలల ఏర్పాటు
- జలయజ్ఞానికి పెద్ద పీట
- గడువులోగా సాగునీటి ప్రాజెక్టుల పూర్తి
- ఖరీఫ్ నుంచి రైతులకు 9 గంటల విద్యుత్ సరఫరా
- దశలవారీగా స్థానిక సంస్థలకు విధులు, నిధుల బదలాయింపు
- రైతులకు కనీస ఆదాయం సమకూరే చర్యలు
- కడప జిల్లాలో 5 మిలియన్ టన్నుల ఉక్కు కర్మాగారం ఏర్పాటు
- చిత్తూరు జిల్లాలో 6 వేల కోట్ల రూపాయలతో బిహెచ్ఇఎల్ కర్మాగారం
- భూపాలపల్లిలో జులై నెలాఖరు నాటికి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం
- రాష్ట్ర పౌరలందరికీ బయోమెట్రిక్ గుర్తింపు కార్డులు
- 50 శాతం మందికి పావలా వడ్డీ రుణాలు
- ఉత్తర కోస్తాలో రెండు భారీ అల్యూమినియం ప్రాజెక్టులు
- విద్యాభివృద్దికి బ్రాడ్ బాండ్ వినియోగం
- రైతులకు కనీస మద్దతు ధర
- గృహిణులకు వాణిజ్య బ్యాంకుల్లో నోఫ్రిల్ ఖాతాలు
- ప్రస్తుత వసతి గృహాలను ఆశ్రమ విద్యాసంస్థలుగా మార్పు
- ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ల అమలుకు కృషి
- ఆరోగ్యశ్రీ, స్వయం సహాయక బృందాలకు చేయూత
- వెనకబడిన తరగతుల విద్యార్థులకు సాంకేతిక ట్యూషన్ ఫీజులు చెల్లింపులు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X