వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వోగ్ పై దీపికా పడుకొనే

By Staff
|
Google Oneindia TeluguNews

Deepika Padukone
లండన్‌: లాటిన్‌ అమెరికాకు చెందిన ప్రముఖ 'వోగ్‌' మేగజీన్‌ ముఖచిత్రంగా తొలిసారి ఓ భారతీయ అందానికి అవకాశం దక్కుతోంది. బాలీవుడ్‌ సుందరి దీపికా పదుకొనేయే ఆ అదృష్టవంతురాలని 'ఫిమేల్‌ ఫస్ట్‌' పత్రిక తెలిపింది. వోగ్‌, కాసాస్‌ మేగజీన్‌ ల కోసం ఫొటోలకు పోజివ్వడానికి పదుకొనే గత నెల పెరూలోని లిమాకు వెళ్లారు. అక్కడ మిరాఫ్లోర్స్‌ పార్క్‌ హోటల్‌ లోని ప్రెసిడెన్షియల్‌ సూట్‌(విలాసవంతమైన గది)లో ఆమె కొన్ని రోజులున్నారు. అంతకుముందు ఆ గదిలో బిల్‌ క్లింటన్‌, టామీ హిల్‌ఫైగర్‌ లాంటి ప్రముఖులు విడిది చేశారు.

ఈ అనుభవంపై దీపికను విలేఖరులు ప్రశ్నించగా "ఆ ప్రెసిడెన్షియల్‌ ప్యాలెస్‌ నేనింత వరకు చూసిన అద్భుత కట్టడాలన్నింటిలోకెల్లా అద్భుతమైనది. వర్ణించడానికి పదాలు సరిపోనంత అందమైంది. పెరూ ప్రజలు కూడా చాలా మంచోళ్లు. ఓ అపరిచిత వ్యక్తికి వారింత మర్యాద ఇస్తున్నారంటే నిజంగా వాళ్లు ఇష్టపడే వారిపై ఎంత ప్రేమ చూపిస్తారో! అక్కడి పర్యాటక మంత్రి నుంచి స్థానిక సూపర్‌ మార్కెట్‌ లో పనిచేసే సిబ్బంది వరకు అందరూ ఎంతో ప్రేమతో పలుకరించారు. వారిపై నా మనసంతా కృతజ్ఞతాభావంతా నిండిపోయింది" అని ఆమె అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X