రాజీవ్ మొట్వానీ ఆకస్మిక మృతి

రాజీవ్ మొట్వానీ మృతదేహం కాలిఫోర్నియాలోని ఆయన నివాసంలోని స్విమ్మింగ్ పూల్ వద్ద శుక్రవారం పడి ఉంది. మరణానికి కారణాలు తెలియడం లేదు. ఆయన వయస్సు 47 ఏళ్లు. టెక్నాలజీని వాడుతున్న సమయంలో మొట్వానీ తప్పకుండా గుర్తు వస్తారని గూగుల్ వ్యవస్థాపకుడు సర్జే బ్రిన్ తన బ్లాగ్ లో రాశారు. మొట్వానీని తన మిత్రుడిగా, ఉపాధ్యాయుడిగా ఆయన అభివర్ణించారు. మొట్వానీ మృతి తనకు తీరని లోటని ఆయన అన్నారు. తాను స్పృశించిన విద్యార్థుల్లో, ప్రాజెక్టుల్లో, కంపెనీల్లో మొట్వానీ వారసత్వం, వ్యక్తిత్వం ఉంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications