గవర్నర్ తెలంగాణ మాట: నిరసన

Rosaiah
హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్థిక మంత్రి కె.రోశయ్య కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతనే తెలంగాణపై తగిన నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర గవర్నర్ ఎన్డీ తివారీ చెప్పారు. గవర్నర్ సోమవారం రాష్ట్ర ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణపై ప్రకటన చేసే సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రోశయ్య కమిటీ బోగస్ అని వారు నినాదాలు చేశారు. ఈ సమయంలో కాంగ్రెసు, తెరాస సభ్యులు పరస్పరం నినాదాలు చేశారు.

తెలంగాణ విషయంలో ప్రభుత్వం రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందని తెరాస శాసనసభా పక్ష నాయకుడు అనంతరం మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రసంగం మొదట్లో గవర్నర్ తెలంగాణ అంశాన్ని తప్పు పట్టేలా మాట్లాడారని, ఆ తర్వాత తెలంగాణపై రోశయ్య కమిటీ నివేదిక తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారని, దీన్ని బట్టి తెలంగాణపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేది అర్థమవుతోందని ఆయన అన్నారు. వేర్పాటువాద రాజకీయాలను ప్రజలు ఇటీవలి ఎన్నికల్లో తిరస్కరించారని గవర్నర్ తన ప్రసంగం మొదట్లో అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+