హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మా వల్లే వైయస్ కు గౌరవం: బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తమ వల్లనే ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి ఢిల్లీలో గౌరవం లభించిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మంగళవారం శాసనసభలో మాట్లాడారు. తాము చేపట్టిన కార్యక్రమాలు ఫలితాలు ఇస్తున్నాయని, వాటిని కాంగ్రెసు ఎంజాయ్ చేస్తోందని ఆయన అన్నారు. బెల్టు షాపులను మూసేయాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. తాగుడు పెంచి ప్రభుత్వం ఆబ్కారీ ఆదాయాన్ని పెంచుకుంటోందని ఆయన వ్యాఖ్యానించారు. బెల్టు షాపుల వల్ల ప్రజల ఆరోగ్యం చెడిపోతోందని ఆయన అన్నారు.

బీమ్ రావ్ బాడ పేదలకు ఇళ్లు కట్టించి పోయిన ప్రతిష్టను తిరిగి సంపాదించుకోవాలని ఆయన ముఖ్యమంత్రికి సూచించారు. ప్రభుత్వం తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతానని ఆయన అన్నారు. ప్రణబ్ కమిటీకి కాంగ్రెసు తెలంగాణపై తన అభిప్రాయాన్ని చెప్పకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. ఎన్నికల సందర్భంగా రాయలసీమలో తెలంగాణపై ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన ధ్వజమెత్తారు. మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టును అపించాలని ఆయన డిమాండ్ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X