అప్పుడు తప్పు చేశా: వైయస్

పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరూ కృషిచేయాలని ఆయన కోరారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రవర్తన, వ్యవహారశైలిని మార్చుకుని గౌరవ ప్రతిష్ఠలు పెంచుకోవాలని సూచించారు. అధికారంలోకి వచ్చామని గర్వపడకుండా, అధికార దర్పం చూపకుండా ప్రజలకు చేరువయ్యేందుకు శ్రద్ధ చూపాలని కోరారు. తమ గొప్పతనం వల్లే అధికారంలోకి వచ్చామని గర్వపడితే ప్రజలు మళ్లీ బుద్ధి చెబుతారని గుర్తుంచుకోవాలని హితవుపలికారు. ప్రజలకు, పార్టీకి అందుబాటులో ఉండాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్ని ఎదుర్కోవాల్సి ఉందని, దీన్ని అందరూ దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. కక్ష సాధింపులకు పాల్పడకుండా ఉండాలని ఎమ్మెల్యేలు, మంత్రులు పార్టీ కార్యక్రమాల్లో విధిగా పాల్గొనాలని చెప్పారు. ఇతర నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోకూడదని హితవు పలికారు. శాసనసభ సమావేశాలకు విధిగా హాజరుకావాలని స్పష్టంచేశారు. ప్రతి ఎమ్మెల్యే కూడా ఓటర్లలో విశ్వసనీయత పెంచుకునేలా కృషిచేయాలని, స్థానిక ఎన్నికలపై దృష్టిసారించాలని సీఎం సూచించారు.












Click it and Unblock the Notifications