హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అప్పుడు తప్పు చేశా: వైయస్

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్: 1991లో 4 లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచిన తాను 1996 ఎన్నికల్లో ఓడిపోతాననే అనుకున్నానని, చివరకు 5500 ఓట్ల మెజారిటీతో బయటపడ్డానని, 1994లో తానుకూడా కొందరిని ఓడించేందుకు పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం వల్లే ఇలా జరిగిందని, అప్పట్లో తాను తప్పు చేశానని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయి. "మనం వ్యతిరేకంగా చేసిన వాళ్లు మనకు వ్యతిరేకంగా పనిచేయకుండా ఎందుకుంటారు? అలాంటి పరిస్థితిని ఎవరూ తెచ్చుకోవద్దు, పార్టీకి ద్రోహం చేస్తే తల్లికి ద్రోహం చేసినట్లే" అని అన్నట్లు ఆ వార్తలు తెలుపుతున్నాయి..అసెంబ్లీ కమిటీహాలులో సోమవారం జరిగిన కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశంలో వైఎస్‌, పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ మల్లు భట్టి విక్రమార్క, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు.

పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరూ కృషిచేయాలని ఆయన కోరారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రవర్తన, వ్యవహారశైలిని మార్చుకుని గౌరవ ప్రతిష్ఠలు పెంచుకోవాలని సూచించారు. అధికారంలోకి వచ్చామని గర్వపడకుండా, అధికార దర్పం చూపకుండా ప్రజలకు చేరువయ్యేందుకు శ్రద్ధ చూపాలని కోరారు. తమ గొప్పతనం వల్లే అధికారంలోకి వచ్చామని గర్వపడితే ప్రజలు మళ్లీ బుద్ధి చెబుతారని గుర్తుంచుకోవాలని హితవుపలికారు. ప్రజలకు, పార్టీకి అందుబాటులో ఉండాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్ని ఎదుర్కోవాల్సి ఉందని, దీన్ని అందరూ దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. కక్ష సాధింపులకు పాల్పడకుండా ఉండాలని ఎమ్మెల్యేలు, మంత్రులు పార్టీ కార్యక్రమాల్లో విధిగా పాల్గొనాలని చెప్పారు. ఇతర నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోకూడదని హితవు పలికారు. శాసనసభ సమావేశాలకు విధిగా హాజరుకావాలని స్పష్టంచేశారు. ప్రతి ఎమ్మెల్యే కూడా ఓటర్లలో విశ్వసనీయత పెంచుకునేలా కృషిచేయాలని, స్థానిక ఎన్నికలపై దృష్టిసారించాలని సీఎం సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X