వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మైక్ టైసన్ మూడో పెళ్లి

By Staff
|
Google Oneindia TeluguNews

Mike Tyson
లాస్ వేగాస్‌: బాక్సింగ్ వీరుడు మైక్ టైసన్ మూడోసారి పెళ్లి చేసుకున్నాడు. తన నాలుగేళ్ల కూతురు ట్రేడ్ మిల్లు ప్రమాదంలో మరణించిన రెండు వారాలకే అతను మరో పెళ్లి చేసుకున్నాడు. ఒక ప్రైవేట్ పంక్షన్ లో మైక్ టైసన్, లకిహా స్పైసర్ శనివారం రాత్రి పెళ్లి చేసుకున్నట్లు లాస్ వేగాస్ లోని హిల్టన్ హోటల్ కాసినో వద్ద గల లా బెల్లా వెడ్డింగ్ చాపెల్ యజమాని షాన్ అబ్సేర్ చెప్పారు.

క్లార్క్ కౌంటీ మ్యారేజీ బ్యూరో నుంచి వచ్చిన వారిద్దరు స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి పది గంటలకు పెళ్లి చేసుకున్నట్లు అతను చెప్పాడు. ఈ కార్యక్రమానికి 30 నిమిషాల ముందు 42 ఏళ్ల టైసన్, 32 ఏళ్ల స్పైసర్ వివాహం కౌంటీ మ్యారేజీ రికార్డుల్లో నమోదైంది. టైసన్ 1988లో నటి రాబిన్ గివెన్స్ ను, 1997లో మోనికా టర్నర్ ను వివాహం చేసుకున్నాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X