హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాదులో మరో స్వైన్ ఫ్లూ కేసు

By Staff
|
Google Oneindia TeluguNews

Swine Flu
హైదరాబాద్: హైదరాబాదులో మరో స్వైన్ ఫ్లూ కేసు నమోదైంది. ఆరేళ్ల పాపకు స్వైన్ ఫ్లూ సోకినట్లు హైదరాబాదులోని ఛాతీ వైద్యశాల వైద్యులు చెప్పారు. మరో రెండున్నరేళ్ల బాబుకు స్వైన్ ఫ్లూ లక్షణాలున్నట్లు గమనించారు. ఈ బాబుకు సంబంధించి పరీక్షల ఫలితాలు ఢిల్లీ నుంచి రావాల్సి ఉంది. ఈ కొత్త కేసుతో హైదరాబాదులో స్వైన్ ఫ్లూ వ్యాధి సోకిన వారి సంఖ్య 8కి చేరింది. దేశవ్యాప్తంగా ఈ వ్యాధి సోకిన వారి సంఖ్య 16కు చేరింది. సగానికి పైగా స్వైన్ ఫ్లూ రోగులు హైదరాబాదులోని ఉండడం విశేషం.

ఈ నెల 9వ తేదీన న్యూయార్క్ నుంచి వచ్చిన దంపతులకు చెందిన ఆరేళ్ల పాప స్వైన్ ఫ్లూ వ్యాధి బారిన పడింది. వారికే చెందిన బాబుకు స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు తేల్చారు. ఇదిలా ఉంటే, స్వైన్ ఫ్లూ వ్యాధి పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ఉన్న జబ్బుగా సంస్థగా గుర్తించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X