• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రేప్ కేసులో బాలీవుడ్ నటుడు

By Staff
|

Shiney Ahuja
ముంబయి: బాలీవుడ్‌ వర్థమాన నటుడు, 'గ్యాంగ్ స్టర్' ఫేం షైనీ అహుజాను పోలీసులు గత రాత్రి అరెస్టు చేశారు. తన ఇంట్లో పనిచేసే ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలపై అతన్ని అరెస్టు చేశారు. అతని ఇంట్లో పనిచేసే 19 ఏళ్ల యువతి షైనీ అహుజా తనపై అత్యాచారం చేశాడంటూ అంథేరీ పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేసింది. తానే ఏడాదిగా ఆ ఇంట్లో పనిచేస్తున్నానని, ఆదివారం తాను పనిలోకి వెళ్లినప్పుడు అతని భార్య ఇంట్లో లేదని పనిమనిషి తెలిపింది.

ఆయన భార్య, కూతురు వేరే దేశం వెళ్లారని తెలిపింది. ఆమె ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు అమెను వైద్యపరీక్షలకు పంపగా అత్యాచారానికి గురైనట్లు నిర్థారణ అయింది. దీంతో షైనీ అహుజాను రాత్రి అరెస్టు చేశారు. అతను కూడా నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈరోజు అతనికి కూడా వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. షైనీ అహుజా 'గ్యాంగ్‌స్టర్‌' 'హజారోం క్యాయిషే అయిసీ' చిత్రాల అనంతరం పాపులర్‌ అయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X